శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Nov 26, 2020 , 03:13:03

ఓటుకు దరఖాస్తు చేయాలి

ఓటుకు దరఖాస్తు చేయాలి

కొత్తగూడెం: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇదివరకే ఓటరుగా నమోదైన వారు ఓటరు జాబితాలో పేరు పరిశీలించుకోవాలన్నారు. నమోదు, మార్పులు, సవరణలకు బీఎల్‌వోలు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు ఈ రిజిస్ట్రేషన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల్లోపు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్‌, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌ , డీఆర్‌వో అశోకచక్రవర్తి, ఎన్నికల డీటీ డేవీడ్‌ కరుణాకర్‌ పాల్గొన్నారు.