శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Nov 25, 2020 , 06:56:44

అధికారులకు టెలీ కాన్ఫరెన్స్‌

 అధికారులకు టెలీ కాన్ఫరెన్స్‌

  • తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి
  • ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ఆర్‌వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి

ఖమ్మం/కొత్తగూడెం : వాతావరణ శాఖ జారీ చేసిన తుఫాన్‌ హెచ్చరిక నేపథ్యంలో అధికారుందరూ ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్‌వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్‌ శాఖ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా తుఫాన్‌ వల్ల ఎటువంటి నష్టం సంభవించకకుండా ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తహసీల్దార్లతో పాటు వ్యవసాయ, ఇరిగేషన్‌ శాఖల, మండల ప్రత్యేక అధికారులు తమ తమ కార్యస్థానాల్లోనే ఉండాలని వారు ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల యొక్క ధాన్యం తడవకుండా వారికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు.