నిబంధనల ప్రకారమే ముక్కోటి దర్శనం

- దేవాదాయశాఖ అనుమతి తర్వాతే పకడ్బందీగా ఏర్పాట్లు
- ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు
భద్రాచలం : శ్రీసీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో వచ్చే నెలలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనాన్ని ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారమే భక్తులకు ఏర్పాట్లు చేయనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో, ఇన్చార్జ్ సబ్‌కలెక్టర్ గౌతమ్ పోట్రు అన్నారు. సోమవారం సాయంత్రం శ్రీసీతారామచంద్రస్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనానికి సంబంధించిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తున్నందున ముక్కోటి ఏకాదశికి సంబంధించిన పూజా కార్యక్రమాలను దేవాదాయశాఖ కమిషనర్ వద్ద నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదేశాల అనంతరం నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహిస్తారని, భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
దేవాదాయశాఖ నుంచి సరైన ఆదేశాలు వచ్చేంతవరకు భక్తులకు కల్పించే సౌకర్యాల పనులు ప్రారంభించాలని, సౌకర్యాలు కల్పించిన చోట మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సంబంధిత శాఖల అధికారులు వసతి సౌకర్యాలు ఎలా చేశారో దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని ఉండాలని, దేవాదాయశాఖ కమిషనర్ దగ్గర నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుందామన్నారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో శివాజీ, ఇరిగేషన్ డీఈ పవన్చౌదరి, ఏఈఈ వెంకటేష్, డీఈ రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస యాదవ్, దేవస్థాన పర్యవేక్షకుడు శ్రీనివాస్, ఎఫ్‌వో జీపీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- మారిన ప్రత్యేక రైళ్ల సమయాలు
- రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..