శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Nov 24, 2020 , 00:17:22

బీటీపీఎస్‌ యూనిట్‌-2లో సీవోడీ ప్రారంభం

బీటీపీఎస్‌ యూనిట్‌-2లో  సీవోడీ ప్రారంభం

  • 270 మెగావాట్లు నమోదైన విద్యుత్‌ ఉత్పత్తి
  • ఉత్పత్తి స్థిరం కాగానే రాష్ట్ర అవసరాలకు సరఫరా
  • ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్న జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు

మణుగూరు : ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక సరిహద్దు ప్రాంతంలో నిర్మిస్తున్న 1080(4x270) మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌)లో యూనిట్‌-2 సీవోడీ ప్రక్రియం ప్రారంభమైంది. రెండో యూనిట్‌లో జెన్కో, భెల్‌ అధికారులు సమిష్టి కృషితో ట్రయల్న్‌ ప్రక్రియంలో భాగంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు యూనిట్‌-2లో సీవోడీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ పనులను విద్యుత్‌ సౌధ నుంచి టీఎస్‌ జెన్‌కో అండ్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పర్యవేక్షిస్తుండగా అధికారులు ప్రక్రియ పనులు నిర్వహించారు. ఇప్పటికే ట్రయల్న్‌ ప్రక్రియంలో భాగంగా రెండో యూనిట్‌ నుంచి వచ్చే విద్యుత్‌ ఉత్పత్తిని గ్రేడ్‌కు అనుసంధానం చేసినట్లు జెన్కో అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా సోమవారం యూనిట్‌-2లో 270 మోగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ యూనిట్‌లో 270 మోగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి స్టేబుల్‌ వచ్చిన వెంటనే అధికారికంగా సీవోడీ ప్రక్రియను నిర్వహించనున్నారు. ప్రక్రియ అధికారికంగా పూర్తైన వెంటనే 270 మెగవాట్ల విద్యుత్‌ ఉత్పత్తితో యూనిట్‌-2లో నిర్వహించనున్నారు. ఇటీవల దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్లాంట్‌ను సందర్శించి నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. బీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ పిల్లి బాలరాజు ఆధ్వర్యంలో అన్నిరకాల ప్లాంట్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జెన్కో, భెల్‌ అధికారులు తెలిపారు.