శుక్రవారం 15 జనవరి 2021
Badradri-kothagudem - Nov 24, 2020 , 00:17:25

33 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

33 మంది మిలీషియా  సభ్యుల లొంగుబాటు

  • వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ సునీల్‌ దత్‌
  • మావోయిస్టులు జన జీవనంలో కలవాలని పిలుపు
  • ప్రజలు చైతన్యవంతులు కావాలని విజ్ఞప్తి

కొత్తగూడెం క్రైం: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తితో 33 మంది మిలీషియా సభ్యులు జిల్లా పోలీసు ల ఎదుట లొంగిపోయారని భ ద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌ తెలిపారు. ఆయన సోమవారం కొత్తగూడెంలోని తన కా ర్యాలయంలో విలేకరు ల సమావేశంలో వెల్లడించిన వివరాలు... మావోయిస్టు పార్టీ చర్ల మండలం బత్తినపల్లి, కిష్టారంపాడు గ్రామాలకు చెందిన 33 మంది మిలీషియా సభ్యు లు, గ్రామ కమిటీ సభ్యులు లొంగిపోయారు. వీరంతా మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో రెండేళ్లపాటు పనిచేశారు. వీరిలో కొంతమంది మిలీషియా సభ్యులు పెద్దమిడిసిలేరు రోడ్‌ బ్లాస్టింగ్‌, కలివేరు మందు పాతరల ఏర్పాటు, తిప్పాపురం వద్ద రోడ్‌ రోలర్‌, జేసీబీల దహనం ఘటనల్లో పాల్గొన్నారు.

జనజీవన స్రవంతిలోకి రావాలి

ఏజెన్సీలో పోలీసులు చేపట్టిన చైతన్యవంతమైన కార్యక్రమాలతో వీరంతా మార్పు చెంది జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని ఎస్పీ చెప్పారు. అడవిబాట పట్టిన ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో జనంలోకి రావాలని కోరారు. పార్టీ నుంచి బయటకు రావానుకున్న వారు దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లోగానీ, బంధు మిత్రుల ద్వారాగానీ, నేరుగా ఎస్పీనిగానీ సంప్రదించవచ్చని సూచించారు. లొంగిపోయిన వారి జీవనోపాధికి పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఆర్‌పీఎఫ్‌ 141 బెటాలియన్‌ కమాండెంట్‌ హరి ఓం ఖారే, సెకండ్‌ ఇన్‌ కమాండెంట్‌ కేసీ అహ్లావత్‌, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) వుప్పు తిరుపతి, చర్ల సీఐ బొడ్డు అశోక్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ బూర రాజగోపాల్‌, చర్ల ఎస్సై ఆలెం రాజు వర్మ, ఎస్సై తిరుమని రవికుమార్‌, పోలీస్‌ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

లొంగిపోయింది వీరే..

చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన తుర్రం అజ్జయ్య అలియాస్‌ అర్జున్‌ (మిలీషియా), కల్లూరి రాజబాబు (మిలీషియా), తుర్రం బాబూరావు (మిలీషియా), సున్న రాజారావు (మిలీషియా), స్యామల బాలకృష్ణ (మిలీషియా), తుర్రం జంపు (మిలీషియా), సున్నం రాజబాబు (మిలీషియా), కల్లూరి మురళి (మిలీషియా), ఇర్పా అర్జున్‌ (మిలీషియా), కొమరం వాసు (మిలీషియా), కరక సమ్మయ్య (మిలీషియా), కనితి ఆంజనేయులు (మిలీషియా), సున్నం నర్సింహారావు (మిలీషియా), కల్లూరి పవన్‌ (మిలీషియా), ఇర్పా ప్రసాద్‌ (మిలీషియా), గట్టుపల్లి రామారావు (మిలీషియా), కల్లూరి శ్రీను (మిలీషియా), మిడియం రామారావు (మిలీషియా), తుర్రం సర్వేశ్వరరావు (మిలీషియా), కనితి మురళి (మిలీషియా), తుర్రం రాము (మిలీషియా), కరం వెంకటేశ్‌ (మిలీషియా), కొమరం రాజబాబు (మిలీషియా), యాసం వీరయ్య (మిలీషియా), మిడియం వెంకటరావు (మిలీషియా), చర్ల మండలం కిష్టారంపాడు గ్రామానికి చెందిన సోడి ఉంగయ్య అలియాస్‌ మహేశ్‌ (మిలీషియా), బడిష రమేశ్‌ అలియాస్‌ బబ్లు (మిలీషియా), మడకం లక్ష్మయ్య (మిలీషియా), దెర్ధో దేవా (మిలీషియా), మడకం ఐతయ్య (గ్రామ కమిటీ), మడివి గంగయ్య (గ్రామ కమిటీ), మడకం భద్రయ్య (గ్రామ కమిటీ), మడకం సన్నయ్య (గ్రామ కమిటీ).