శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 22, 2020 , 02:15:52

అదిగో పులి.. ఇదిగో జాడ..!

అదిగో పులి..  ఇదిగో జాడ..!

  • గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి  ప్రాంతాల్లో పులి సంచారంపై వదంతులు

అమ్మో పులి.. అదిగో అరుపులు.. ఇవిగో అడుగులు.. అడవిలో పెద్ద పులి అరుపులు వినిపించాయని కొందరు, అడుగులు కనిపించాయని మరికొందరు, ఆవుపై దాడి చేసి చంపిందని మరికొందరు. కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, తాడ్వాయి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఒక్కటే భయాందోళన.నిజంగానే పులి తిరుగుతున్నదా..? అరుపులు వినిపించాయా..? అడుగు లు కనిపించాయా..? ఆవును చంపిం దా..? అటవీ అధికారులు ఏమంటున్నారు...? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు...వీటన్నింటికి జవాబే ఈ కథనం..

.ఆళ్ళపల్లి: గుండాల, ఆళ్ళపల్లి, కాచనపల్లి, అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదన్న వారం రోజులుగా వస్తున్న వదంతులతో ఇక్కడి ఏజెన్సీ పల్లెలు వణుకుతున్నాయి. పులిని స్వయంగా చుశామని కొందరు, అరుపులు వినిపించాయని మరికొందరు, కాలి అడుగుల జాడలు కనిపించాయని ఇంకొందరు చెబుతున్నారు.  దీంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది పులి జాడ కపెట్టేందుకు అడవుల్లో అణువణువూ గాలిస్తున్నారు. గుండాల మండలంలోని రాయిగూడెం ప్రాంతంలోగలని పాలమొట్టి వాగు సమీపంలో పులి  సంచరిస్తున్నదని అక్కడి గ్రామస్తులు చెప్పడంతో అటవీ అధికారులు కాచనపల్లి అటవీ ప్రాంతంలో శనివారం విస్తృతంగా గాలించారు.

ఆ ఆవును చంపింది పులేనా..?

పులి సంచరిస్తున్నదన్న వదంతులు ఇలా సాగుతున్న తరుణంలోనే ఓ ఆవును ఏదో జంతువు శనివారం చంపింది. గుండాల మండలంలోని మ ర్కోడు పంచాయతీ పాతూరు గ్రామ రైతు కొ మరం సత్యనారాయణ తన చేను వద్ద పశువును మేపి అక్కడే కట్టేసి సాయంత్రం వేళ ఇంటికి వె ళ్లాడు. మరుసటి రోజున ఆ పశువును మేపేందుకు చేను వద్దకు వచ్చాడు. కానీ అక్కడ ఆ పశువు కనిపపించలేదు. ఆందోళనకు లోనయ్యాడు. చుట్టుపక్కల వెతుకుతుండగా ఒకచోట తన ఆవు కళేబరం (మృతదేహతం) కనిపించింది.  భయంతో వణికిపోయాడు. ‘ఏదో గుర్తు తెలియని జంతువు చంపి, ఇలా  కొంత దూరం లాక్కెళ్లింది’ అనుకున్నాడు. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఓ జంతువు అడుగు జాడలు కనిపించాయి. ఈ సమాచారంతో ఇల్లందు ఫారెస్ట్‌ డివిజిన ల్‌ అధికారి అనిల్‌కుమార్‌ అద్వర్యంలో గుండాల రేంజర్‌ మురళి, ఆళ్ళపల్లి రేంజర్‌ నరసింహారావు, సిబ్బంది వెళ్లారు.

ఆ రైతుతోపాటు స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. “శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిది-పది గంటల సమయంలో ఈ ఆవుపై దాడి జరిగింది. దాడి చేసి కొంతదూరం లాక్కెళ్లి చంపినట్లు ఆనవాళ్లు కపించాయి. అక్కడ కనిపించిన అడుగు జాడలను పరీక్షకు పంపిస్తాం. అవి ఏ జంతువుకు చెందినవో  తెలుస్తుంది. ఒకవేళ ఆ ఆవును ఏదేని జంతువు చంపినట్లయితే... కళేబరం కోసం మళ్లీ వస్తుంది. దాని కోసం ఆ ప్రాంతంలో మూడు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశాం” అని చెప్పారు. ఏ ఒక్కరు కూడావారం రోజులపాటు ఈ ప్రాంతానికి రాకూడదని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ ఆవును నష్టపోయిన రైతుకు నాలుగు రోజుల్లో పరిహారం అందిస్తామన్నారు. ఆ అటవీ ప్రాంత పల్లెల్లోని రైతులు, కూలీలు మాత్రం “ఆ అ డుగులు కచ్చితంగా పులివే. ఆ ఆవును చం పింది పులే. పంటలు చేతికొస్తున్న తరుణం లో చేలల్లోకి ఎలా వెళ్లేది..? వెళ్లకుండా ఎలా ఉండేది..?” అని  భయపడుతున్నారు.

కనిపించని ఆనవాళ్లు

గుండాల/కరకగూడెం:  కరకగూడెం, గుం  డాల, ఆళ్లపల్లి, తాడ్వాయి అటవీ సరిహద్దు ప్రాం తాల్లో పులి సంచరిస్తున్నదన్న వార్తలు-వదంతుల తో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.  రం గాపురం, వీరాపురం, నీలాద్రిగండి, దామరతోగు ప్రజలను ఆరా తీశారు. గుండాల మండలం దామరతోగులోని అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. పులి ఆనవా ళ్లు ఏమాత్రం కనిపించలేదు. నీటి తోగులు, కుంటలు దట్టమైన అటవీ ప్రాం తాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ గాలింపులో ఎఫ్‌డీవో వేణుబాబు, ఏడూళ్ళ బయ్యారం ఎఫ్‌ఆర్‌వో వెంకటేశ్వర్లు, దామరతోగు సెక్షన్‌ ఆఫీసర్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.