గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 22, 2020 , 02:15:52

రామయ్యను దర్శించుకున్న పోస్టల్‌ ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్‌

 రామయ్యను దర్శించుకున్న పోస్టల్‌ ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్‌

పర్ణశాల: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల రామయ్యను శనివారం ఖమ్మం జిల్లా పోస్టల్‌ శా ఖ సూపరింటెండెంట్‌ యలమందయ్య కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి వేదమంత్రాలతో పూజలు నిర్వహించి అధికారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పంచవటిని దర్శించుకుని ఆలయ విశిష్టతను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు, ఆలయ ఇన్‌చార్జి రమేశ్‌బాబు, సిబ్బంది రాము, శివ, పోస్టల్‌ శాఖ అధికారులు, ఆఫీస్‌ ఇన్‌చార్జి శేఖర్‌, ఇన్‌చార్జి ఐపీవో ఎస్‌వీ రావు, బండిరేవు బీపీఎం నరేశ్‌, పర్ణశాల ఏబీపీఎం అజయ్‌ ఉన్నారు.