శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 21, 2020 , 01:26:36

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

భద్రాచలం/సారపాక: బూర్గంపహాడ్‌ మండలంలో 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మెయింటనెన్స్‌లో భాగంగా శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బూర్గంపహాడ్‌, మోరంపల్లిబంజర, సారపాక విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఏఈ మునీర్‌పాషా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులు విద్యుత్‌ సిబ్బందికి సహకరించాలని కోరారు.

మణుగూరు రూరల్‌లో..

మండలంలోని గుట్టమల్లారం సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తున్నందునశనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మండలంలోని అన్ని ఏరియాలలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఏఈ వేణుగోపాల్‌ తెలిపారు.

కరకగూడెంలో..

మండల వ్యాప్తంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని విదుత్య్‌ ఏఈ రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.