గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 21, 2020 , 01:26:36

మన్యంపై మంచుదుప్పటి

మన్యంపై మంచుదుప్పటి

మన్యంపై మంచుదుప్పటి పరుచుకుంటోంది.. ఉదయం 8 గంటల వరకు మంచుతెరలు వీడకపోవడడం లేదు. భానుడు మంచుతెరల నడుమ పచ్చని చెట్లమాటున దోబూచులాడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. పనులకు వెళ్లే వారు మంచులోనే పనులకు వెళ్తున్నారు. రహదారులపై ప్రయాణించే వాహన దారులు మంచుకి ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. మంచుతో ఓ పక్క భయమేసినా మరోపక్క మంచుతెరల అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. శుక్రవారం దమ్మటపే, కొత్తగూడెం మండలాల్లో ఈ సుందర దృశ్యాలను నమస్తే క్లిక్‌ మనిపించింది.

-కొత్తగూడెం/దమ్మపేట