శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 20, 2020 , 04:52:20

భూ సేకరణ వివరాల సవరణకు సహకరించాలి

భూ సేకరణ వివరాల సవరణకు సహకరించాలి

  • అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు

మణుగూరు రూరల్‌: బీటీపీఎస్‌ రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరణలో నమోదు చేసిన వివరాలలో చోటు చేసుకున్న తప్పిదాలు సవరించేందుకు శుక్రవారం దరఖాస్తులు అందజేసిన వారందరూ అధికారులకు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం బీటీపీఎస్‌ రైల్వేలైన్‌ ఏర్పాటుకు భూ సేకరణలో భాగంగా విప్పలసింగారం పంచాయతీలో సర్పంచ్‌ పాల్వంచ ఈశ్వరమ్మ అధ్యక్షతన  నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. తొలుత రైల్వేట్రాక్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న 84 కుటుంబాల పేర్లను చదివి వినిపించి కుటుంబ సభ్యుల వివరాల నమోదులో చోటుచేసుకున్న తప్పులను సవరించారు. తమ కుటుంబ సభ్యుల పేర్లు న మోదు కాలేదని పలువురు తెలపడంతో వారి నుంచి దరఖాస్తులు సేకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నమోదులో దొర్లి న తప్పిదాలపై సర్వే చేసేందుకు శుక్రవారం వివరాలు సేకరించేందుకు వీఆర్‌వో, సర్వేయర్లు పర్యటిస్తారని కుటుంబసభ్యులు రేషన్‌కార్డుతో అందుబాటులో ఉండాలన్నారు.  ప్రభుత్వానికి వివరాలు నివేదించి ప్రభుత్వ ఆదేశానుసారం రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, విప్పలసింగారం సర్పంచ్‌ పాల్వంచ ఈశ్వరమ్మ, ఉపసర్పంచ్‌ గోరంట్ల కనకయ్య, కూనవరం సర్పంచ్‌ ఏనిక ప్రసాద్‌, బీటీపీఎస్‌ ఎస్‌ఈ రాంప్రసాద్‌, పెసా కమిటీ సభ్యుడు సోడె రవి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.