సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 20, 2020 , 04:52:20

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

  • టీఆర్‌ఎస్‌ నాయకుడు  వనమా రాఘవ

కొత్తగూడెం : అభివృద్ధి జరగాలంటే అది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేంద్రరావు అన్నారు. గురువారం ఆయన జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న రోజుల్లో కొత్తగూడెంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పేదప్రజల ఆశాజ్యోతి అన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. కేసీఆర్‌ స్ఫూర్తితో నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా సమయంలో 60వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేశానని అన్నారు. తన పుట్టిన రోజున నాయకులు, కార్యకర్తలు చూపిన అభిమానం నేను మరచిపోలేనని అన్నారు. ముందుగా త్రీటౌన్‌ సెంటర్‌లో కార్యకర్తలు రక్తదానం చేశారు. పట్టణంలో నాయకులంతా వారి అభిమానాన్ని చాటుకున్నారు. మూడవ వార్డులో వార్డు కౌన్సిలర్‌ రహదారిపై పూలను పరిచి స్వాగతం పలికారు. ఆయన ఇంటిలో ఏర్పాటు చేసిన కేక్‌ కటింగ్‌లో కుటుంబ సభ్యులతో కేక్‌ కట్‌ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. రాఘవ రాజకీయ నేపథ్యంపై పాడిన గీతాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే     నియోజకవర్గంలో అభిమానులు అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నేత రాఘవేందర్‌రావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. త్రీటౌన్‌ సెంటర్‌లో 8 వేల స్వీట్స్‌ ప్యాకెట్లను తయారు చేసి ప్రభుత్వ కార్యాలయాలు, పేదలకు పంపిణీ చేశారు. పాల్వంచ, సూపర్‌బజార్‌, విద్యాసాగర్‌ ప్రాంతాల్లో వనమా అభిమానులు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానం చేశారు.

పోస్టాఫీస్‌, పాతకొత్తగూడెం, రామవరం ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు చేశారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో వడ్డాది విజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావత్‌ శాంతి, సోనా, విజయలక్ష్మి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, తూము చౌదరి, ఆళ్ల మురళి, కాసుల వెంకట్‌, ఎంఏ రజాక్‌, ఎంపీటీసీ కొల్లు పద్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.