శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 18, 2020 , 02:31:09

‘సీతమ్మ సాగర్‌' సర్వే వివరాలు సమగ్రంగా ఉండాలి

‘సీతమ్మ సాగర్‌' సర్వే వివరాలు సమగ్రంగా ఉండాలి

  • భద్రాచలం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ పోట్రు గౌతమ్‌ ఆదేశం

భద్రాచలం: సీతమ్మ సాగర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టు కరకట్ట, గోదావరికి ఆనుకొని ఉన్న మండలాల్లోని భూముల సర్వే  ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏ రోజుకు ఆ రోజు వివరాలను సమగ్రంగా స్కాన్‌ చేసి కంప్యూటర్‌లో పొందుపరచాలని భద్రాచలం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌ పోట్రు తు గౌతమ్‌ సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. మంగళవారం సబ్‌కలెక్టరు కార్యాలయంలోని తన చాంబర్‌లో దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం తహసీల్దార్లు ల్యాండ్‌ సర్వే, ఏడీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లతో సర్వే ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే భూములకు వ్యవసాయ భూమికి ఇంటి స్థలాలకు సంబంధించినవి వేరు వేరుగా వాల్యు ఉంటుందని, ప్రతీది ఒకే రేటు కింద నమోదు చేయకూడదని, సర్వే చేసిన అన్ని గ్రామాలు మండలాల వారీగా ఒక ఫైల్‌లో నమోదు చేయాలని, సర్వే మాత్రం చాలా పకడ్బందీగా ఉండాలని, భూములకు సంబంధించిన యజమానులు సంతృప్తి వ్యక్తపరిచే విధంగా సర్వే చేయాలన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు మాత్రమే భూమిపై హక్కు ఉంటుందని, గిరిజనేతరులకు ఎటువంటి హక్కు ఉండదని అన్నారు. సర్వే అయిన తరువాత ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసి ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్‌కి పంపి తెలుగు, ఇంగ్లిషు పేపర్లో పబ్లిష్‌ అయ్యేలా చూడాలని పబ్లిష్‌ అయన పేపరు నోటిఫికేషన్‌ను ఈ జాబితాలో పొందుపరచాలన్నారు. ల్యాండ్‌ అండ్‌ సర్వే డీడీ వెంకటేశ్వరరావు, ఏడీ కుసుమకుమారి, అశ్వాపురం తహసీల్దారు రామకృష్ణ, చర్ల తహసీల్దారు అనీల్‌కుమార్‌, డీఏవో రాజేంద్రకుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ నరసింహారావు పాల్గొన్నారు.