మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 17, 2020 , 05:09:38

ఫిర్యాదులు పరిష్కరించారు... భేష్‌

ఫిర్యాదులు పరిష్కరించారు... భేష్‌

కొత్తగూడెం: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించిన అధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అభినందించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌'ను సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేశారు. గత వారం వచ్చిన 51 ఫిర్యాదుల్లో 23 పరిష్కారమైనట్లు చెప్పారు. మిగిలినవి రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించినవి. వీటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్‌తో చెప్పారు. అవకాశమున్న ఫిర్యాదులను  తక్షణమే పరిష్కరించి తనకు నివేదిక ఇవ్వాలన్నారు. ఈ శనివారం నాటికి అన్నీ పరిష్కారం కావాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.