మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 12, 2020 , 03:57:19

రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి

రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి

మణుగూరు రూరల్‌: రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేసి సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏరియా జీఎం జక్కం రమేశ్‌ అన్నారు. జీఎం కార్యాలయంలో ఇద్దరు యువకులకు కారుణ్య నియామక పత్రాలను బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ... క్రమశిక్షణతో పనిచేస్తూ నాగాలు లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. పర్సనల్‌ మెనేజర్‌ అజయ్‌కుమార్‌, పీవో రాజేశ్వర్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్‌ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.