బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 12, 2020 , 03:57:19

రైతు సంక్షేమానికే కొనుగోలు కేంద్రాలు

రైతు సంక్షేమానికే కొనుగోలు కేంద్రాలు

మణుగూరు రూరల్‌: టీఆర్‌ఎస్‌ది రైతు ప్రభుత్వమని, అందుకే రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి నష్టపోవద్దనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని జడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు అన్నారు. మండలంలోని అన్నారం, అనంతారం, గుట్టమల్లారం ప్రాంతాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్‌ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. పోశం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులు పూర్తిగా ఆరబెట్టి తాలు లేకుండా తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయకుమారి, డీటీ శివకుమార్‌, ఏడీఏ తాతారావు, ఏఈవోలు భూపతి వీరేంద్రనాయుడు, హారిక,   వైస్‌ ఎంపీపీ కెవీరావు, ఎంపీటీసీ సభ్యులు తాటి సరిత, బాబుజాన్‌,  తాతా మాధవి, ఉప సర్పంచ్‌ పుచ్చకాయల శంకర్‌, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యంబా బు, అడపా అప్పారావు, నాయకుడు ఆవుల నర్సింహారావు, సంఘం డైరెక్టర్లు మామిడిపల్లి సీతారాములు, కురం సతీష్‌, ఉడతనేని రమేశ్‌, పప్పుల ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు దొండేటి రా మ్మోహన్‌, సీఈవో జ్ఞానదాస్‌, యువజన సం ఘం అధ్యక్షుడు  హర్షనాయుడు పాల్గొన్నారు.