సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 11, 2020 , 02:30:15

రాత్రి గస్తీని పటిష్టం చేయండి

రాత్రి గస్తీని పటిష్టం చేయండి

  • భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌ దత్‌

అశ్వారావుపేట : నేరాలు అదుపు లక్ష్యంగా రాత్రి గస్తీని మరింత పటిష్టపరచాలని జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. దొంగతనాల నియంత్రణకు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల నమోదు, దర్యాప్తు తీరును పరిశీలించారు. కేసుల పురోగతిపై ఆరా తీశారు. కేసుల నమోదులో పారదర్శకత పాటించాలని, నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టాలని, కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కేసుల నమోదు, దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. మండల వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో హరితహారం క్రింద మొక్కలు నాటారు. ఆయన వెంట సీఐ ఉపేందర్‌రావు, అశ్వారావుపేట, దమ్మపేట ఎస్సైలు మధు ప్రసాద్‌, రామ్మూర్తి, వరుణ్‌ ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.