శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 09, 2020 , 04:11:26

మంచుకురిసే వేళలో..

మంచుకురిసే వేళలో..

ఉదయాన్నే మంచు తెరలు ‘భద్రగిరి’ని కప్పేస్తున్నాయి. ఆ మంచు తెరలను చీల్చుకుంటూ సూరీడు ఉదయిస్తుంటే.. రామాలయం వెనుక ఎర్రటి కాంతులు కనువిందు చేస్తున్నాయి. ఆ మంచు దుప్పటిలో కరకట్టపైనుంచి భద్రాద్రిని చూస్తుంటే మనసు పులకిస్తోంది. దుమ్ముగూడెం నుంచి పర్ణశాల వెళ్లే ప్రధాన రహదారిపై కురిసే మంచు.. ఊటీని తలపిస్తున్నది. దుమ్ముగూడెంలో 9 గంటల వరకూ పొగమంచు వీడకపోవడంతో లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగించారు వాహనదారులు. ఈ అందమైన మంచు దృశ్యాలను ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించింది.   

- భద్రాచలం/ పర్ణశాల/ దుమ్ముగూడెం