శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 09, 2020 , 04:11:25

మంత్రుల పర్యటనను విజయవంతం చేద్దాం

మంత్రుల పర్యటనను విజయవంతం చేద్దాం

  • తనికెళ్లలో రైతువేదికను పరిశీలించిన ఎమ్మెల్యే రాములునాయక్‌ 

కొణిజర్ల : మండలంలోని తనికెళ్లలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పవ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాములునాయక్‌ భవనాన్ని ఆదివారం పరిశీలించి స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ శ్రేయస్సు కోసం ఏ కాలంలో ఏఏ పంటలు వేయాలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రైతాంగాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మిస్తుందన్నారు. అలాంది వేదికలను ప్రారంభించేందుకు

ఇద్దరు మంత్రులు హాజరుకానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించి పలుసూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, జడ్పీటీసీ పోట్ల కవిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోసూరి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ దొడ్డపునేని రామారావు, సర్పంచ్‌ చల్లా మోహన్‌రావు, బండారు కృష్ణ, ఏలూరి శ్రీనివాసరావు, గుండ్ల కోటి, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.