బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 09, 2020 , 04:11:19

కాంగ్రెస్‌లో కుమ్ములాట

కాంగ్రెస్‌లో కుమ్ములాట


  • డీసీసీ అధ్యక్షుడిపై బూతు పురాణం
  • మండల అధ్యక్షుడిని సస్పెండ్‌ చేసిన డీసీసీ అధ్యక్షుడు
  • మొన్న భద్రాచలం, నేడు ఇల్లెందులో లొల్లి

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ కుమ్ములాటల్లో మునిగితేలుతున్నది. అంతర్గత విభేదాలు, క్రమశిక్షణారాహిత్యంతో పార్టీ పరువును నా యకులే బజారున పడేసుకుంటున్నారు. మొన్న భద్రాచలంలోని డివిజన్‌ కార్యాలయంపై నాయకులు పర స్ప రం ఫిర్యాదులు చేసుకున్నారు. అది ముగియక ముందే  శుక్రవారం ఆ పార్టీకి జిల్లాలో ఉన్న ఏకైక (భద్రాచలం) ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యను ఇల్లెందుకు చెందిన నాయకుడు బూతులు తిట్టాడు. దీనికి ప్రతిగా డీ సీసీ అధ్యక్షుడు కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. వీరిద్దరి బూతుల పంచాంగం, తిట్ల దండకం ఆడియో టేపులు సోషల్‌ మీడియాలో శనివారం చక్కర్లు కొట్టాయి.

ఇలా మొదలైంది..

ఇల్లెందు మండల అధ్యక్షుడిగా ఉన్న పోచం వెంకటేశ్వర్లును ఆ పదవి నుంచి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య తప్పించి, పులి సైదులు అనే వ్యక్తిని నియమించారు. దీనిని సహించలేని పోచెం వెంకటేశ్వర్లు శుక్రవారం సరాసరి పొదెం వీరయ్యకు ఫోన్‌ చేసి నేరుగానే బూతు పురాణం అందుకున్నాడు.  వీరయ్య కూడా అదే స్థాయిలో దీటుగా సమాధానమిచ్చారు. ఈ ఆడియో టేపులు బయటకు రావడంతో పార్టీ పరువు బజారున పడింది. పొచెం వెంకటేశ్వర్లును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.

చుక్కాని లేని నావ...

భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్‌ పార్టీ.. చుక్కాని లేని నావలా పయనిస్తున్నది. దిశా నిర్దేశం చేసే నాయకుడు లేడు. కింది స్థాయి నాయకుల్లో క్రమశిక్షణారాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఫలితంగా జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కోల్పోయే దుస్థితికి చేరింది. ఈ జిల్లాలో కేవలం భద్రాచలం నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీకి చెందిన నాయకుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. స్థానిక నాయకుల నడుమ సమన్వయ లోపం కారణం తో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నెల రోజుల క్రి తం భ ద్రాచలంలో ఉన్న డివిజన్‌ కాంగ్రెస్‌ కార్యాలయంపై ఆ ధిపత్యం కోసం ఆ పార్టీలోని ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీనిని పరిష్కరించడంలో జిల్లా నాయకత్వం విఫలమైంది. దీంతో ఆ  పంచాయితీ గాంధీ భవన్‌కు చేరింది. తాజాగా ఇల్లెందులో మం డల అధ్యక్ష పదవి ఆ వర్గ విభేదాలను రచ్చకెక్కించింది. కొ త్తగూడెం నియోజకవర్గంలో సైతం నాయకులు తలోదిక్కున ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన పినపాక నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ ద్వితీయ స్థాయి నా యకత్వం పూర్తిగా టీఆర్‌ఎస్‌లోకి చేరింది. దీంతో అక్కడ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించే నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికినే కోల్పోయే స్థితిలో ఉంది.