గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 06, 2020 , 00:55:59

‘ఈ’ మేథమెటిక్‌ సెమినార్‌కు ఆహ్వానం

‘ఈ’ మేథమెటిక్‌ సెమినార్‌కు ఆహ్వానం

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఎస్‌సీఈఆర్‌టీ) హైదరాబాద్‌ నిర్వహించే ‘ఈ’ మేథమెటిక్‌ సెమినార్‌లో పాల్గొనేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులతోపాటు డైట్‌, డీఈడీ, బీఎడ్‌ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ‘మేథమెటిక్‌ ఎడ్యుకేషన్‌ ద వే హెడ్‌ ఇన్‌ ది కాంటెస్ట్‌ ఆఫ్‌ న్యూ ఎడ్యుకేషనల్‌ పాలసీ-2020’ అంశంపై సెమినార్‌ ఉంటుందని వివరించారు. నాలుగు సబ్‌ థీమ్స్‌ కలిగిన ఈ సెమినార్‌లో పాల్గొనదలిచిన వారు ఆన్‌లైన్‌ ద్వారా ఆంగ్లం, తెలుగు భాషల్లో తమ సెమినార్‌ పేపర్లను డిసెంబర్‌ 2వ తేదీలోగా పంపాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డీఎస్‌వో చలపతిరావును 92472 96012 సెల్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు