ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 06, 2020 , 00:56:10

ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌తో మోసపోవద్దు

ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌తో మోసపోవద్దు

కొత్తగూడెం అర్బన్‌: మున్సిపల్‌ కార్పొరేషన్‌  రుణాలు ఇప్పిస్తామంటూ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ పేరిట లబ్ధిదారులకు మోసగాళ్లు ఫోన్‌ చేస్తున్నారని, వీటిని నమ్మవద్దని కొత్తగూడెం మున్సిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు కోరారు. అర్హులైన లబ్ధిదారులకు మున్సిపల్‌ కార్యాలయంలోనే బ్యాంకర్ల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి రుణాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.