సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 05, 2020 , 05:22:26

క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసవుతున్న యువత

 క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసవుతున్న యువత

కొత్తగూడెం క్రైం: మద్యానికి, జూదానికి బానిసలైన వారు మార్పు చెందకపోతే జీవితాలు ఛిద్రమవడం ఖాయమనే విషయం ప్రస్తుతం మనమంతా చూస్తూనే ఉన్నాం. పేకాట, కోడి పందేలు, చిత్తుబొత్తు లాంటివి మాత్రమే ఇలాంటి జూదాల్లో ఫేమస్‌. కానీ ఐపీఎల్‌  (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) వచ్చిన నాటి నుంచి బెట్టింగ్‌ తరీఖానే మారిపోయింది. చేతిలో మొబైల్‌ ఉంటే చాలు బెట్టింగ్‌కు సిద్ధమవుతున్నారు కొందరు యువత. బాగా చదువుకుని, కొలువులు సాధించి స్థిర పడాల్సిన వయస్సులో కటకటాల పాలవుతున్నారు. ఇంకొందరు అప్పులపాలై, వాటిని తీర్చలేక ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. బుధవారం హైదరాబాద్‌లో సోనుకుమార్‌ అనే యువకుడు బెట్టింగ్‌లకు పాల్పడి, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వెలుగు చూడని ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరెన్నో ఉన్నాయి.