మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 04, 2020 , 01:31:08

రాష్ట్రంలో కుల వృత్తులకు జీవం

రాష్ట్రంలో కుల వృత్తులకు జీవం

పాల్వంచ: బలహీన వర్గాలకు చెందిన కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని చింతలచెర్వులో మంగళవారం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద వంద శాతం రాయితీతో మంజూరైన చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ చింతా శ్రీకాంత్‌, మత్స్యశాఖ జిల్లా అధికారి వరదారెడ్డి, తహసీ ల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ నాగేశ్వరరావు, ఎంపీపీ మడి సరస్వతి, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ కాంపెల్లి కనకేష్‌, మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు గొర్రె సాంబయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్‌, మల్లెల శ్రీరామ్మూర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులు కిలారు నాగేశ్వరరావు, మహిపతి రామలింగం, కాల్వ ప్రకాష్‌, మల్లెల రవిచంద్ర, ఆరుద్ర సత్యనారాయణ, మేడిద సంతోష్‌ గౌడ్‌, బండి చిన్న వెంకటేశ్వర్లు, మార్కెట్‌ సత్తి, బొందిలి హరి పాల్గొన్నారు.