ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 02, 2020 , 02:38:04

సాగునీటి ప్రాజెక్టుగా వట్టివాగు

సాగునీటి ప్రాజెక్టుగా వట్టివాగు

  • రెండు పంటలకు  పుష్కలంగా  సాగునీరు
  •  ఇప్పటికే అన్ని  రకాల సర్వే  పూర్తిచేసిన ఇరిగేషన్‌ శాఖ
  •  రూ.11 కోట్ల అంచనా వ్యయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి రెండుపంటలకు సాగు నీరందించే లక్ష్యంతో నూతన సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూపకల్పన చేస్తున్నది. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన సమత్‌మోతె పంచాయతీలోని గొడుగుబండ వద్ద వట్టివాగుపై చిన్ననీటి తరహా సాగునీటి ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖ అధికారులు వట్టివాగు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల సర్వేలను నిర్వహించి ప్రభుత్వానికి పంపారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

  -మణుగూరు

మణుగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి రెండుపంటలకు సాగు నీరందించే లక్ష్యంతో నూతన సాగునీటి ప్రాజెక్ట్‌లను రూపకల్పన చేస్తున్నది. ఈ క్రమంలో కరకగూడెం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన సమత్‌మోతె పంచాయతీలోని గొడుగుబండ వద్ద వట్టివాగుపైన రాష్ట్ర ప్రభుత్వం చిన్ననీటి తరహా సాగునీటి ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖ అధికారులు వట్టివాగు సాగునీటి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల సర్వేలను నిర్వహించి ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వల్ల 42 ఏకరాల భూమిని 27 మంది రైతులు కోల్పోతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే రైతులకు త్వరలోనే నష్టపరిహారం రానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరగా చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. 

వెయ్యి ఎకరాల ఆయకట్టు

వట్టివాగు ప్రాజెక్ట్‌ నిర్మాణంతో గొడుగుబండ, తుమ్మలగూడెం, రేగుళ్ళ, శ్రీరంగాపురం, చొప్పాల, కొత్తూరు తదితర గ్రామాల్లోని సుమారు 1007 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు పుష్కలంగా అందనుంది. ఈ గ్రామాల్లో అధికశాతం గిరిజనులు, ఎస్సీలే ఉన్నారు. మండలంలోని గొడుగుబండలో 180 ఎకరాలు, తుమ్మలగూడెంలో 320 ఎకరాలు, రేగుళ్ళ లో150 ఎకరాలు, చొప్పాలలో 250 ఎకరాలు, శ్రీరంగాపురంలో 100 ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. ఈ వట్టివాగు సమీప ముసలమ్మ గుట్టలు, చిల్లతోగు నుండి ప్రవహిస్తూ అల్లేరుగూడెం వద్ద పెద్దవాగులో కలుస్తుంది. 

రూ.11కోట్ల వ్యయంతో నిర్మాణం..

వర్షాకాలం ఆరంభంలో మొదలుకొని సుమారు 6నెలలపాటు వట్టివాగు ప్రవహిస్తుందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఈ ప్రాజెక్ట్‌ ప్రతిపాదిత ప్రాంతమైన గొడుగుబండ ప్రాంతంలో ఇప్పటికే అన్ని రకాల సర్వేలు నిర్వహించారు. దీని నిర్మాణానికి సుమారు రూ.11కోట్ల వ్యయం అవుతుందని అంచనాతో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఇది చిన్ననీటి తరహా ప్రాజెక్ట్‌ కావడంతో ప్రభుత్వం త్వరితగతిన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. 

రెండు పంటలకు సాగునీరు 

వట్టివాగుపై ప్రాజెక్టు నిర్మిస్తే రైతులు ఎంతో ఉపయోగం. రెండు పంటలకు పుష్కలంగా సాగు నీరు అందనుంది. ఇప్పటికే ఇరిగేషన్‌శాఖ అధికారులు అన్ని రకాల సర్వే రిపోర్టును ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు రానున్నాయి. పులులు బొంత, వట్టివాగు ప్రాజెక్టులతో పాటు మర్ని కొన్ని సాగు నీటి ప్రాజెక్టులపైన ప్రత్యేక దృష్టిపెట్టా. వట్టివాగు, పులుసుబొంత ప్రాజెక్టులనిధుల కోసం సీఎంను కలుస్తాను. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే ఐదు గ్రామాల రైతులకు రెండు పంటలకు సాగు నీరు ఢోకా ఉండదు. 

ఐదు గ్రామాలు సస్యశ్యామలం..

ఈ ప్రాజెక్ట్‌ నిర్మిస్తే 5 గ్రామాల్లోని వెయ్యి ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. వట్టివాగుపై సాగునీటి ప్రాజెక్ట్‌ నిర్మిస్తే ఈ ప్రాంత రైతులంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. గ్రామాల్లోని వర్షాధారం పైనే ఆధారపడివున్న చెరువుల్లో నీటిని నింపుకోవచ్చు. ప్రభుత్వం తప్పక ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తుందని నమ్మకం ఉంది.

-రేగా కాంతారావు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే