శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 30, 2020 , 04:53:25

54 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

54 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

రఘునాథపాలెం : ప్రజా పంపిణీకి చెందిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఏసీపీ వెంకట్రావ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం అర్బన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అర్బన్‌ పరిధి అగ్రహారం గేటు వద్ద తనిఖీలు చేస్తుండగా  లారీలో 54క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీన పర్చుకున్నారు. లారీ డ్రైవర్‌ లక్ష్మణ్‌రావును విచారించగా చింతకాని గ్రామానికి చెందిన పెనుగొండ నాగేశ్వరరావు అనే వ్యక్తి బియ్యాన్ని  విక్రయించేందుకు రవాణా చేస్తున్నట్లు తేలినట్లు ఏసీపీ తెలిపారు. బాధ్యులపై చర్యల నిమిత్తం అర్బన్‌ పోలీసులకు అప్పగించామన్నారు.