శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 30, 2020 , 04:53:25

ధరణి హాసం..

ధరణి హాసం..

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,  
  • జడ్పీ చైర్మన్లు, ఐటీడీఏ పీఓ

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ధరణి ద్వారా పారదర్శక సేవలు ప్రారంభం కావడంపై కర్షక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇన్నేళ్లూ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలకు చక్కని పరిష్కారం లభించనుంది. భూతగాదాలు, గెట్ల పంచాయితీలకు రాష్ట్ర సర్కార్‌ చరమగీతం పాడింది.  రెవెన్యూ చట్టంలో భూములకు సంబంధించి ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను గురువారం మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి తాసీల్‌ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్‌, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. రఘునాథపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌, పాలేరులో ఎమ్మెల్యే కందాల, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, పాల్వంచ తహసీల్దార్‌ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, భద్రాచలంలో ఐటీడీఏ పీవో గౌతమ్‌ పోట్రు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు    ప్రారంభించారు.

  -నెట్‌వర్క్‌