మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 27, 2020 , 04:48:19

రేపు భద్రాద్రి జిల్లాలో మంత్రి పర్యటన

రేపు భద్రాద్రి జిల్లాలో మంత్రి పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, 11 గంటలకు మణుగూరు మండలంలో రామానుజవరం నుంచి పగిడేరు వరకు రహదారి నిర్మాణ పనలకు శంకుస్థాపన, 11:30 గంటలకు మణుగూరులో కునుకుగు గుంపు వద్ద లోవెల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆదర్శనగర్‌లో శంకుస్థాపన, 12:15 గంటలకు అశ్వారావుపేట నుంచి అమ్మగారిపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, మధ్యాహ్నం 2 గంటలకు కొత్తగూడెం క్లబ్‌లో వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.