బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 27, 2020 , 04:48:19

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ : ఎమ్మెల్యే సండ్ర

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ : ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి : ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులోని ఆయన స్వగృహంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ఐదుగురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం పాలై కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు, అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసా కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.