శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 25, 2020 , 01:46:39

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల శిబిరం ధ్వంసం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల శిబిరం ధ్వంసం

కొత్తగూడెం క్రైం : ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మావోయిస్టుల శిబిరాన్ని కనుగొన్న జవాన్లు వాటిని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఓ జవాన్‌ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌ అడవుల్లో జిల్లా రిజర్వు గార్డ్‌ (డీఆర్‌జీ) భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓర్చా కదర్‌ అటవీ ప్రాంతం లో మావోయిస్టుల శిబిరాన్ని కొనుగొన్న జవాన్లు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంతసేపు కాల్పులు జరిగాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డీఆర్‌జీ జవాన్‌ సంతురామ్‌ వడ్డే మృతిచెందాడు. జవాన్లు సంఘటన స్థలం నుంచి భారీగా మావోయిస్టుల డంపుని స్వాధీనపరుచుకుని, జవాన్‌ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ పాటిలింగం స్పష్టత ఇచ్చారు.