మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 25, 2020 , 01:46:42

ఇంటి పన్నులపై చట్ట ప్రకారం రివ్యూ చేపట్టాలి

  ఇంటి పన్నులపై చట్ట ప్రకారం రివ్యూ చేపట్టాలి

  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు : మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు మున్సిపాలిటీలో ఇటీవల పెంచిన ఇంటి పన్నులపై పట్టణ వ్యాపారులు, పట్టణ ప్రముఖులు, ఇంటి యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో పెరిగిన ఇంటి పన్నులపైన పంచాయతీ రాజ్‌ చట్ట ప్రకారం రివ్యూ చేయిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఇంటిపన్నులపై అవగాహన కల్పించేలా ఈనెల 27న మరో మారు పట్టణ వ్యాపారులు, పట్టణ ప్రముఖులు, ఇంటి యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించన్నుట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి వేసవిలో స్వచ్ఛమైన గోదావరి జలాలు నల్లా ద్వారా సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.5కోట్ల వ్యయంతో పైపులైన్‌ పనులు జరుగుతున్నాయన్నారు. తొలుత ప్రభుత్వం విప్‌ రేగా  మణుగూరు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటస్వామితో ప్రత్యేకంగా ఇంటిపన్నులపై చర్చించారు. 

పట్ట భద్రులు ఓటరు నమోదు చేసుకోవాలి

శనివారం మణుగూరు ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో మణుగూరు, మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ ్ట నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకుతో ప్రత్యేకంగా మాట్లాడారు.  పినపాక నియోజకవర్గంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, యువజన నాయకులు, పార్టీ అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పార్టీ మణుగూరు మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, అడపా అప్పారావు,  పీఏసీఎస్‌ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొలిశేట్టి నవీన్‌, చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షడు దోసపాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి దండా రాధాకృష్ణ, పార్టీ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్‌, వట్టం రాంబాబు, ముద్దంగుల కృష్ణ, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, ఇంటి యజమానులు తదితరులు పాల్గొన్నారు.