మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 24, 2020 , 01:42:53

నిరుపేదల కోసమే...ముఖ్యమంత్రి సహాయ నిధి

నిరుపేదల కోసమే...ముఖ్యమంత్రి సహాయ నిధి

సత్తుపల్లి : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది వచ్చిన నిరుపేదలను ఆదుకునేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి పథకమని  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గవ్యాప్తంగా 93 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద విడుదలైన రూ.56.50లక్షల విలువైన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ రెండేళ్లలో రూ.5కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు సహాయం అందిందని, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ ఆర్థ్ధికసాయం అందించామన్నారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌లో వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పట్టణప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు తగ్గాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. 

రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంబులెన్స్‌లు వితరణగా ఇచ్చారని, వాటిలో సత్తుపల్లి నియోజకవర్గానికి మూడు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటెల రాజేందర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.   ఈ కార్యక్రమంలో చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, ఆత్మచైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, రైతుబంధు కన్వీనర్‌ గాదె సత్యం, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీను, పాలా వెంకటరెడ్డి, కనగాల వెంకట్రావు, కౌన్సిలర్లు షేక్‌ చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌, మేకల భవానీ, అమరవరపు విజయనిర్మల, కంటే నాగలక్ష్మితో పాటు నాయకులు ఒగ్గు శ్రీనివాసరెడ్డి, తుమ్మూరు దామోదర్‌రెడ్డి, కాలినేని వెంకటేశ్వరరావు, వల్లభనేని పవన్‌, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఎర్రబాబు), చింతల సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.