మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 24, 2020 , 01:42:49

మంగళదాయినీ.. ఐశ్వర్యలక్ష్మి

మంగళదాయినీ.. ఐశ్వర్యలక్ష్మి

  • భద్రాద్రి రామాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
  • ఐశ్వర్యలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు
  • నేడు వీరలక్ష్మిగా దర్శన భాగ్యం

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీలక్ష్మీతాయారు ఆలయంలో అర్చకులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.  శనివారం అమ్మవారు వీరలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తారన్నారు.