బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 22, 2020 , 02:27:25

సూడ సక్కని తల్లి గౌరమ్మ

సూడ సక్కని తల్లి గౌరమ్మ

  • ఆరో రోజు అలిగిన పూల బతుకమ్మ వేడుక
  • కొత్తగూడెంలో ఆడబిడ్డల ఆటాపాట
  • చిందేసి సందడి చేసిన ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి : రంగు రంగుల బతుకమ్మ నేలను హరివిల్లును చేసింది.. పట్నం నట్టింటికి పూల తోటను తీసుకువచ్చింది.. ఆడబిడ్డలతో ఆట ఆడించింది.. నోరారా పాట పాడించింది.. ‘పూల వనములయే మా పల్లె లోగిళ్లు.. మారుమోగిపోయే ఇంటింటా సందళ్లు..’ అంటూ పదం పాడుతుండగా ప్రతి మదీ పులకించె..! బుధవారం సాయంత్రం కొత్తగూడెం జిల్లాకేంద్రంతో పాటు లక్ష్మీదేవిపల్లి మండలంలో అలిగిన బతుకమ్మ వేడుకలు జరిగాయి.. సంబురాలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరై బతుకమ్మనుద్దేశించి మాట్లాడారు. బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు వ్యాపించిందన్నారు.

అనంతరం బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఎంపీపీ భూక్యా సోనా, సంజయ్‌ నగర్‌ ఎంపీటీసీ పద్మ, తాటి పద్మ, ఎంపీటీసీ కొల్లు పద్మ, అంగన్‌వాడీ సీడీపీఓ కనకదుర్గ, సర్పంచ్‌లు తాటి పద్మ, భూక్యా పద్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు తూము చౌదరి, కొట్టి వెంకటేశ్వర్లు, తూము శేషుకుమారి, వస్యా నాయక్‌, పూనం శ్రీను, మధు, మతిన్‌, ఐకి సత్యనారాయణ, సతీష్‌, పూర్ణ, వినోద్‌, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.