బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 20, 2020 , 03:11:10

బొగ్గు రవాణాలో రారాజు రుద్రంపూర్‌

బొగ్గు రవాణాలో రారాజు  రుద్రంపూర్‌

  • సింగరేణిలో అత్యుత్తమ సీహెచ్‌పీగా గుర్తింపు
  • వ్యాగన్ల ద్వారా 87.84 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు తరలింపు
  • రోడ్డు మార్గం ద్వారా 6.24 లక్షల టన్నులు.. 
  • ఉత్తమ ప్లాంటుగా అవార్డులు, నగదు పురస్కారాలు సొంతం

రవాణాలో ముందుంటాం


రక్షణతో కూడిన రవాణాలో ముందుంటాం. పని చేయడమే కాకుండా రావాల్సిన హక్కులను సాధించడంలోనూ టీబీజీకేఎస్‌ ఎప్పుడూ ముందుంటుంది. కార్మికులకు పోటీతత్వాన్ని అలవర్చడం ద్వారా ఈ అరుదైన రికార్డును సాధించాం. కార్మికులు, అధికారుల కృషి ఫలితమే ఈ రికార్డు.  

-ఎండీ.గౌస్‌, ఆర్‌సీహెచ్‌పీ పిట్‌ సెక్రటరీ

రామవరం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీహెచ్‌పీ (రుద్రంపూర్‌ కోల్డ్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్‌) ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను నెలకొల్పి సింగరేణి వ్యాప్తంగా ప్రథమంగా నిలిచింది. వివరాలు.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని భూగర్భ గనులు, ఓసీల్లో ఉత్పత్తి చేసిన బొగ్గు బెల్ట్‌ ద్వారా ఆర్‌సీహెచ్‌పీకి సరఫరా అవుతున్నది. అక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా, రోడ్డు రవాణా ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 31 వరకు 2443 రేకుల ద్వారా (59 వ్యాగన్లను ఒక రేకులు) 87,84,400 మెట్రిక్‌ టన్నులు) ద్వారా ఉత్పత్తి అయిన బొగ్గును రవాణా చేశారు. రోడ్డు మార్గం ద్వారా  6,24,565.50 టన్నుల బొగ్గును రవాణా చేసి రికార్డు నెలకొల్పుతున్నారు. అరుదైన రికార్డు నెలకొల్పినందుకు యాజమాన్యం ఆర్‌సీహెచ్‌పీ కార్మికులకు 3 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని, ఉత్తమ సీఎస్‌పీగా ఎంపికై బహుమతిని సింగరేణి సీఎండీ చేతుల మీదుగా అందుకున్నారు.

నెలవారీగా రైల్వే వ్యాగన్ల ద్వారా,,                                       

ఆర్‌సీహెచ్‌పీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లో 228 రేకుల ద్వారా 7,51,857 టన్నుల బొగ్గు రవాణా, మే 199 రేకుల ద్వారా 6,69,276 టన్నులు, జూన్‌లో 197 రేకుల ద్వారా 6,42,850 టన్నులు, జులైలో 183 రేకుల ద్వారా 6,05,250 టన్నులు, ఆగస్టులో 177 రేకుల ద్వారా 6,11,249 టన్నులు, సెప్టెంబర్‌లో 183 రేకుల ద్వారా 6,72,584 టన్నులు, అక్టోబర్‌లో 188 రేకుల ద్వారా 7,08,590 టన్నులు, నవంబర్‌లో 209 రేకుల ద్వారా 8,03,245 టన్నులు, డిసెంబర్‌లో 226 రేకుల ద్వారా 8,68,597 టన్నులు, జనవరిలో 235 రేకుల ద్వారా 8,97,004 టన్నులు, ఫిబ్రవరిలో 217 రేకుల ద్వారా 8,26,060 టన్నులు, మార్చిలో 191 రేకుల ద్వారా 7,27,639 టన్నులు రవాణా చేసింది.

నెలవారీగా లారీల ద్వారా బొగ్గు రవాణా 

ఆర్‌సీహెచ్‌పీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో లారీల ద్వారా ఏప్రిల్‌లో 54236 టన్నులు, మేలో 60604 టన్నులు, జూన్‌లో 66764 టన్నులు, జులైలో 51792 టన్నులు, ఆగస్టులో 70191 టన్నులు, సెప్టెంబరులో 41335 టన్నులు, అక్టోబర్‌లో 47215 టన్నులు, నవంబరులో 42604 టన్నులు, డిసెంబర్‌లో 44803 టన్నులు, జనవరిలో 46175 టన్నులు, ఫిబ్రవరిలో 49527.03 టన్నులు, మార్చిలో 49320.88 టన్నుల బొగ్గు రవాణా చేసింది.

అధికారుల, యూనియన్‌  నాయకుల ప్రోత్సాహంతో రికార్డులు

ఆర్‌సీహెచ్‌పీలో అధికారులు, గుర్తింపు సంఘం ప్రోత్సాహంతో కార్మికులు రికార్డుల పరంపర కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 16న బి రిలే లోడింగ్‌ అండ్‌ షంటింగ్‌ కార్మికుడు ఈ ఎన్‌ మూర్తి 200 వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయగా ఆయన్ను ఆర్‌సీహెచ్‌పీ డీజీఎం వి.వెంకటేశ్వర్లు ఆర్‌సీహెచ్‌పీ పిట్‌ సెక్రటరీ ఎండి.గౌస్‌, నగదు, శాలువాతో సత్కరించారు. సీ రిలే కార్మికుడు ఆసిఫ్‌ ఫిబ్రవరి 17న 211 వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేసి రికార్డు నెరవేర్చుకున్నారు. 

అడ్డంకులను అధిగమించి    రికార్డులను నెలకొల్పుతాం

ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అడ్డంకులను అధిగమించి రికార్డులు నెలకొల్పుతాం. ప్రతి సంవత్సరం రికార్డును తిరగరాస్తూ కొత్త రికార్డును నెలకొల్పేందుకు సమష్టి కృషితో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. డీజీఎం, ఎస్‌ఈల సహకారంతోనే రికార్డులను నెలకొల్పుతున్నాం.        -నిమ్మల రాజు, బ్రాంచ్‌ సెక్రటరీ, ఆర్‌సీహెచ్‌పీ 

సమష్టి కృషితోనే రికార్డులు 

సమష్టి కృషితోనే సింగరేణిలో ఎసీఎస్‌పీలు రికార్డులు నెలకొల్పుతున్నాయి. అహర్నిశలు శ్రమిస్తున్న కార్మిక సోదరులకు, టెక్నీషియన్‌ సిబ్బందికి, సహచర ఉద్యోగులకు, యూనియన్‌ నాయకులకు ప్రత్యేక అభినందనలు. ఏరియా జీఎం సీహెచ్‌ నర్సింహారావు ప్రోత్సాహం మరువలేనిది.  

-ఉయ్యూరు వెంకటేశ్వరు ్లడీవైజీఎం ఆర్‌సీహెచ్‌పీ

అధికారుల సహకారం మరువలేనిది 

 రికార్డును నెలకొల్పడంలో అధికారుల సహకారం మరువలేనిది. కార్మికులకు, అధికారులకు స్నేహపూర్వకమైన సంబంధం ఉండటం వల్లనే రికార్డులు సాధ్యమయ్యాయి. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. 

-కేవీ చలం, టెండాల్‌, ఆర్‌సీహెచ్‌పీ