బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 20, 2020 , 03:00:37

సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

 సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

  • భద్రాద్రి ఢ్రైక్టర్‌ ఎంవీ రెడ్డి 
  • భద్రాద్రి కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు

కొత్తగూడెం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సిబ్బంది బతుకమ్మ సంబురాల్లో భాగంగా మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బతుకమ్మకు పూజలు చేసి ప్రారంభించి మాట్లాడుతూ... రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ పండుగను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది కరోనా వ్యాధి వల్ల నామమాత్రంగా ఎవరి ఇళ్లల్లో వారే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బతుకమ్మ ఆడుతున్నారన్నారు. మహిళలు తీరొక్క పూలతో సంప్రదాయంగా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. బతుకమ్మను పేర్చే పుష్పాలన్నింటికీ వాతావరణానికి హానిచేయని ఆరోగ్యకరమైన ఔషధాలుంటాయని, అందుకే ఔషదాలు కలిగిన పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఎంతో ఉత్సాహంగా ఆడుతారన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్‌, డీఆర్‌వో అశోక చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేత, డీడబ్ల్యూవో వరలక్ష్మీ, డీపీవో విద్యాలత, కలెక్టరేట్‌ ఉద్యోగుల అరుణ, సౌజన్య, సుమలత, కన్య, మేఘ పాల్గొన్నారు.