గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 20, 2020 , 03:00:34

డిస్మిస్‌ కార్మికులు విధుల్లోకి ..

డిస్మిస్‌ కార్మికులు విధుల్లోకి ..

మణుగూరు రూరల్‌: సింగరేణిలో వివిధ కారణాలతో ఉద్యోగం నుంచి డిస్మిస్‌ అయిన సుమారు మూడు వేల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం పట్ల టీబీజీకేఎస్‌ మణుగూరు బ్రాంచి ఉపాధ్యక్షుడు వూకంటి ప్రభాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం  జయశంకర్‌భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆనాటి కార్మిక సంఘాలు పనిచేశాయే తప్ప కార్మిక పురోభివృద్ధికి పాటుపడలేదన్నారు. ఆనాడు గుర్తింపు సంఘంగా ఉన్న కార్మిక సంఘాలు డిస్మిస్‌ అయిన కార్మికుల విషయంలో ఎందుకు నోరుమెదపలేదో చెప్పాలన్నారు. దీనిని కార్మికలోకం తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం రీజినల్‌ కమిటీ సభ్యుడు అబ్దుల్‌ రవూఫ్‌, బ్రాంచి నాయకులు వీరభద్రయ్య, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, వర్మ, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణ, మునిగెల రమేశ్‌, అశోక్‌ పాల్గొన్నారు.