మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 19, 2020 , 02:26:44

ధరణి పోర్టల్‌ నిర్వహణపై అవగాహన

ధరణి పోర్టల్‌ నిర్వహణపై అవగాహన

  • టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కొత్తగూడెం: ధరణి పోర్టల్‌ నిర్వహణలో నమూనా మాడ్యూల్‌ ద్వారా అవగాహనపై కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆదివారం ధరణి పోర్టల్‌ ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో ధరణి పోర్టల్‌ నిర్వహణపై తహసీల్దార్లు ముందస్తు అవగాహన కలిగి ఉండాలనే అంశంపై సమీక్షించారు. పోర్టల్‌ అందుబాటులో వచ్చే వరకు ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్రంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. ప్రతి తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్‌, ధరణి ఆపరేటర్లు ప్రతిరోజూ మాడ్యూల్‌ ద్వారా అవగాహన పొందాలన్నారు. ధరణి డెస్క్‌టాప్‌, ప్రింటర్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీఎల్‌ఏ కార్యాలయానికి అందించిన ఆధార్‌, మొబైల్‌ నంబర్లు, డీఎస్‌కే సీరియల్‌ నెంబర్లు ఖచ్చితంగా ఉండాలన్నారు.