ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 17, 2020 , 03:35:09

పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలి

పట్టభద్రులతో ఓటు నమోదు చేయించాలి

భద్రాచలం: నియోజకవర్గంలోని పట్టభద్రులతో నిర్ణీత గడువుకన్నా ముందుగానే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయించాలని టీఆర్‌ఎస్‌ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్‌ డాక్టర్‌ తెల్లం వెంకట్రావ్‌ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గతంలో నమోదు చేసుకున్నవారు కూడా మళ్లీ ఇప్పుడు చేయించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో దుమ్ముగూడెం మండల అధ్యక్షుడు అన్నెం సత్యాలు, నాయకులు యశోద నగేష్‌, ఎల్‌.వెంకటేశ్వర్లు, అరికెల తిరుపతిరావు, మామిడి పుల్లారావు, ఎండి.బషీర్‌, రత్నం రమాకాంత్‌, శ్రీనివాస్‌, కేతినేని లలిత తదితరులు పాల్గొన్నారు. 

దుమ్ముగూడెం మండలంలో ముమ్మరం

దుమ్ముగూడెం: ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం మండలవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నది. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీవో ముత్యాలరావు, ఏపీవో సుకన్యకు ఓటరు నమోదు పత్రాలను టీఆర్‌ఎస్‌ నాయకులు అందించి ఓట్లు అభ్యర్థించారు. నాయకులు ఎండి.జానీపాషా, తోట రమేష్‌, మోతుకూరి శ్రీనివాస్‌, దామెర్ల శ్రీనివాస్‌, శెట్టి రామకృష్ణ, జయసింహ, సర్పంచ్‌ భూక్యా చందు తదితరులు పాల్గొన్నారు.