మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 16, 2020 , 00:38:00

కార్మికుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

కార్మికుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌

మణుగూరు రూరల్‌: సింగరేణి కార్మికుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌ అని టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్‌రావు అన్నారు. గురువారం కొండాపురం భూగర్భగనిలో పిట్‌ సెక్రటరీ నాగెళ్లి అధ్యక్షతన జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల పక్షపాతి అయినందునే కార్మికులకిచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలు కవిత చొరవతో రాష్ట్ర నాయకత్వం యాజమాన్యంతో మాట్లాడి నిర్దేశిత మస్టర్లు పూర్తిచేసిన కార్మికులకు పదోన్నతి కల్పించిందన్నారు.

కార్మికులకు 25వేల దసరా అడ్వాన్స్‌, మార్చి నెల నిలిపిన సగం వేతనాన్ని కూడా దసరాలోపే ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం రీజినల్‌ కమిటీ సభ్యుడు అబ్దుల్వ్రూఫ్‌, జీఎం కమిటీ సభ్యుడు కోట శ్రీనివాసరావు, బ్రాంచి నాయకుడు వెంకటేశ్వరరెడ్డి, మైన్‌ పిట్‌ సెక్రటరీ నాగెళ్లి వెంకట్‌, నాయకులు లక్ష్మణ్‌, నగేశ్‌, జైలాలుద్దీన్‌, ఉదయ్‌ పాల్గొన్నారు.