గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 16, 2020 , 00:37:57

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

మణుగూరు రూరల్‌: త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌  పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మట్టపల్లి సాగర్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. గురువారం డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను కలిసి ఫారం -18 ను అందజేసి మాట్లాడారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సిరికొండ శ్యాంసుందర్‌, యువజన నాయకులు పద్దం శ్రీనివాస్‌, సృజన్‌, పిల్లి అఖిల్‌ పాల్గొన్నారు. 

దుమ్ముగూడెం: 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ములకపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి బాలాజీనాయక్‌కు  టీఆర్‌ఎస్‌ మండల అధికార ప్రతినిధి ఎండీ జానీపాషా గురువారం ఓటరు నమోదు పత్రాన్ని అందజేసి మాట్లాడారు. ఖమ్మం-వరంగల్‌-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నందున పట్ట భద్రులు ప్రతి ఒక్కరూ నవంబర్‌  6వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మండల వ్యాప్తంగా పట్టభద్రులను కలిసి ఓటుహక్కు నమోదు చేయించుకోవాలని చెబుతూ ఆన్‌లైన్‌ చేయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి తోట రమేశ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మోతుకూరి శ్రీకాంత్‌, నాయకులు దామెర్ల శ్రీనివాస్‌, పిలకా నాగేందర్‌రెడ్డి, రవి, మాణిక్యాలరావు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.