బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 15, 2020 , 02:09:53

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

మధిర రూరల్‌ : ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం .. మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన అంగడాల హుస్సేన్‌(33) అనే వ్యక్తి మద్యానికి బానిసకావడంతో ఈ నెల 10న అతని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై ఖమ్మంపాడు సమీపంలోని సుబాబుల్‌తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బుధవారం సుబాబుల్‌తోట వద్ద దుర్వాసన వస్తుండటంతో అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రమేశ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.