బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 06, 2020 , 02:12:19

10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ పంట సాగు లక్ష్యం

10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ పంట సాగు  లక్ష్యం

  • రాష్ట్ర ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ  డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

సత్తుపల్లి రూరల్‌: రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ పంటను సాగుచేసే లక్ష్యంగా ఆయిల్‌ఫెడ్‌, ఉద్యానవనశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని రాష్ట్ర ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ డైరెక్టర్‌ లోక వెంకట్రామిరెడ్డి అన్నారు. మండలంలోని సిద్ధారంలో గల పామాయిల్‌ తోటను ఉమ్మడి జిల్లా ఉద్యానవనశాఖాధికారులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 వేల ఎకరాల్లో పామాయిల్‌ సాగవుతోందని, ఆ తర్వాత స్థానం నల్గొండ జిల్లాకు దక్కుతుందని అన్నారు. పామాయిల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలను రాష్ట్రంలో సాగుచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పామాయిల్‌ పంటకు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చారని, దీనిలో భాగంగానే తెలంగాణలో పది లక్షల ఎకరాలు సాగుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. జడీ సరోజినిదేవి, డీడీలు మధుసూదన్‌, శేఖర్‌, భాగ్యలక్ష్మి, ఏడీ లహరి, డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పీఏ ప్రవీణ్‌కుమార్‌, ఖమ్మం జిల్లా ఉద్యానశాఖ పట్టుపరిశ్రమల అధికారి అనసూయ, భద్రాద్రి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖల అధికారి మరియన్న, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు బాలకృష్ణ, శ్రీకాంత్‌రెడ్డి, గోద్రేజ్‌ అధికారులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.