ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Oct 06, 2020 , 02:12:19

తల్లి అస్తికలను నిమజ్జనం చేసిన ఖమ్మం ఎంపీ

తల్లి అస్తికలను  నిమజ్జనం చేసిన ఖమ్మం ఎంపీ

భద్రాచలం: ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారి మాతృమూర్తి వరలక్ష్మీ గారి అస్థికలను సోమవారం భద్రాచల గోదావరిలో నిమజ్జనం చేశారు. తన సోదరులు నామా రామారావు, నామా సీతయ్య, నామా కృష్ణయ్య గార్లతో కలిసి భద్రాచలం వచ్చారు. గోదావరి ఒడ్డుకు చేరుకున్న పిదప అస్థికలోను బ్రాహ్మణులు వారిచే నిమజ్జనం చేయించారు. వీరి వెంట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తెల్లం వెంకట్రావ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తూళ్లూరి బ్రహ్మయ్య, మానె రామకృష్ణ ఉన్నారు.

ఎంపీ నామాను కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు

భద్రాచలం: టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును స్థానిక హౌసింగ్‌ గెస్ట్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌ నియోయకవర్గ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో పట్టణ నాయకులు కలిశారు. మానె రామకృష్ణ, యశోద నగేశ్‌, మామిడి పుల్లారావు, పూనెం కృష్ణ, అరికెల్ల తిరుపతిరావు, గంగా భారతి, మానె కమల, కేతినేని లలిత, ఎండీ బషీర్‌, రాంబాబు, నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

‘నామా’కు పలువురి పరామర్శ

అశ్వారావుపేట : ఎంపీ నామా నాగేశ్వరరావును పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు.  జూపల్లి రమేశ్‌, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, నిర్మల పుల్లారావు,  నూతక్కి నాగేశ్వరరావు, చిన్నంశెట్టి వెంకట నరసింహం, సత్తెనపల్లి వెంకటేశ్వరరావు ‘నామా’ను కలిసి సంతాపం తెలిపారు.