సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 05, 2020 , 00:31:57

ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్‌

ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్‌

అన్నపురెడ్డిపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అబ్బుగూడెం, అన్నపురెడ్డిపల్లిలో ఆదివారం ఆయన పర్యటించి ఇంటింటి సర్వే, డిజిటల్‌ తరగతులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండంలో చేపట్టిన ఇంటింటి సర్వే, ఆన్‌లైన్‌ క్లాస్‌ల ప్రక్రియ వివరాలను ఎంపీడీవో రేవతి ని అడిగి తెలుసుకుని మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటి వివరాలను సేకరించి, ధరణి పోర్టల్‌లో పొం దుపరచాలని తెలిపారు. డిజిటల్‌ తరగతులను చిన్నారులు చూసేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజు, సర్పం చ్‌ పద్మ,  కార్యదర్శి గురునాథరావు, సిబ్బంది పాల్గొన్నారు.