శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 04, 2020 , 00:35:06

రామయ్యకు నిత్యకల్యాణం

రామయ్యకు నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం అర్చకులు రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున గోదావరి నుంచి తీర్థ బిందె తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవా కాలం, పుణఃవచనం, నివేదిన తదితర పూజలు గావించారు. అనంతరం అంతరాలయంలో నిత్య కల్యాణం నిర్వహించారు. వేడుకలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.