శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 04, 2020 , 00:35:13

రామాలయంలో ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్‌

రామాలయంలో ఆర్జిత సేవలకు గ్రీన్‌సిగ్నల్‌

  • నేడో, రేపో అందుబాటులోకి సేవలు
  • ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ
  • ఆలయానికి పునర్వైభవం

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో కోవిడ్‌-19 కారణంగా నిలిపివేసిన ఆర్జిత సేవలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సుప్రభాత సేవ, అంతరాలయ అభిషేకం, అర్చనలు, సువర్ణ పుష్ప అర్చన, సువర్ణ తులసీ పూజలు, నిత్యకల్యాణాల సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. కరోనా ముప్పు నుంచి సాధారణ స్థితికి పరిస్థితులు వచ్చిన కారణంగా ఆలయంలో ఈ సేవలను తిరిగి పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ అధికారులు భావించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఈ మేరకు రామాలయ అధికారులు సేవల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడో, రేపో భక్తులకు సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భక్తుల రాక పెరిగితే భద్రాద్రి పుణ్యక్షేత్రం పునర్వైభవాన్ని సంతరించుకోనుంది.