గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 03, 2020 , 02:05:09

మందగించిన బొగ్గు ఉత్పత్తి

మందగించిన బొగ్గు ఉత్పత్తి

రామవరం: కొవిడ్‌ వల్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌ నర్సింహారావు అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2020-21 సెప్టెంబర్‌లో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన 9.97 లక్షల టన్నుల ఉత్పత్తి లక్షానికి గాను 6.47 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 65 శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. అదే విధంగా 20-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 65.88 లక్షల టన్నులకుగాను 33.84 లక్షల టన్నులను ఉత్పత్తి చేసి 51 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించామని కొత్తగూడెం ఏరియా జీఎం నర్సింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.