శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 02, 2020 , 05:35:48

డిజిటల్‌ తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం

డిజిటల్‌ తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం

  • భద్రాద్రి కొత్తగూడెం డీఈవో ఆగ్రహం
  •  ఇద్దరు హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: డిజిటల్‌ తరగతుల పర్యవేక్షణలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై డీఈవో సోమశేఖర శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. ప్రసారమయ్యే పాఠాల టైంటేబుల్‌ కూడా లేకపోవడాన్ని గమనించారు. కనీసం పిల్ల ల ఫోన్‌ నంబర్లు లేకపోవడం, వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయకపోవడం, పిల్లలు ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నారా లేదా అనే విషయాన్ని తెలిపే నోట్స్‌లు కూడా లేకపోవడంతో ఉపాధ్యాయుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాఠశాలలోగల 16 మంది ఉపాధ్యాయుల్లో 13 మంది ఇంటి నుంచి పని చేయడం ఏమిటని హెచ్‌ఎంను నిలదీశారు. ఇవన్నీ పూర్తిగా సవరించి సోమవారం నాటికి చూపించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నేతాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉండటంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ రెండు పాఠశాలల హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ రామేశ్వరరావు ఉన్నారు.