గురువారం 29 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Oct 01, 2020 , 00:05:13

శిక్షణ నైపుణ్యాలతో లక్ష్యాలు సాధించవచ్చు

శిక్షణ నైపుణ్యాలతో లక్ష్యాలు సాధించవచ్చు

  • విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరురూరల్‌/మణుగూరు: విద్యార్థులు శిక్షణ నైపుణ్యాలతోనే ఉన్నత లక్ష్యాలు సాధించగలుగుతారని విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ముత్యాలమ్మనగర్‌ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత రేగా విష్ణు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆటోమెటిక్‌ శానిటైజర్‌ మిషన్‌ను, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అందించిన వాటర్‌ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు సంపూర్ణ అవగాహనతో బయటకు వెళ్లినప్పుడే పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారన్నారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ విజయకుమారి, కుర్రి నాగేశ్వరరావు, ముత్యాలమ్మనగర్‌ సర్పంచ్‌ కొమరం జంపేశ్వరి, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు కృష్ణమోహన్‌, కుడితిపూడి వెంకటేశ్వరరావు, ముత్యాలరావు, చంద్రమోహన్‌, తారా ప్రసాద్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు జావీద్‌ పాషా, ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షుడు ముత్యంబాబు, అడపా అప్పారావు పాల్గొన్నారు.

విప్‌ రేగాను కలిసిన సెంట్రల్‌ మిర్చి  టాస్క్‌ఫోర్స్‌ కమిటీ డైరెక్టర్‌ 

మణుగూరు: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సెంట్రల్‌ మిర్చి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ డైరెక్టర్‌ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సెంట్రల్‌ మిర్చి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన నాసిరెడ్డి సాంబశివరెడ్డిని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి   కమిటీ డైరెక్టర్‌గా నియమితులుకావడం అభినందనీయమని అన్నారు.  పినపాక జడ్పీటీసీ సుభద్ర వాసు, ఆత్మ కమిటీ చైర్మన్‌ పొనుగోటి భద్రయ్య, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కామేశ్వరరావు, వికాస్‌ అగ్రో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ పచ్చిపులుపు సురేశ్‌, కాట్రగడ్డ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

విప్‌ రేగాను కలిసిన ఐటీసీ జీఎం పాత్రో 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్‌ రేగా కాంతారావును ఐటీసీ జీఎం పాత్రో కలిశారు. ఇటీవల ఐటీసీ నూతన మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన  పాత్రో మర్యాదపూర్వకంగా రేగాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. చంగల్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ బాలసానికి పరామర్శ

మలుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నయ్య బాలసాని ముత్తయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం విప్‌ రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కలిసి పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలుత బాలసాని ముత్తయ్య చిత్రపటం వద్ద నివాళి ఆర్పించారు. డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.logo