మంగళవారం 20 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Oct 01, 2020 , 00:05:31

శరీరానికి నిత్యం పోషకాలు అందాలి

శరీరానికి నిత్యం పోషకాలు అందాలి

  • పోషణమాసం ముగింపు సమావేశంలో కొత్తగూడెం డీడబ్ల్యూవో వరలక్ష్మి
  • పాల్గొన్న డీఎంహెచ్‌ఓ, కౌన్సిలర్లు, సీడీపీఓలు
  • ఉత్తమ సేవలకు పురస్కారాలు

కొత్తగూడెం: మానవ శరీరానికి నిత్యం పోషకాలు అందాలని జిల్లా సంక్షేమ అధికారిణి వరలక్ష్మి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో న్యూగొల్లగూడెం సెక్టార్‌లో పోషణమాసం ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే పోషకాలు అందాలని చూడొద్దని, మనం నిత్యం ఇంట్లో మంచి పోషక విలువల గల ఆహారం తీసుకోవాలన్నారు.  ప్రతి రోజూ గుడ్డు,పాలు,కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలన్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పదిహేను రోజుల కొకసారి ఇంటికే అంగన్‌వాడీ సరుకులు ఇస్తున్నామన్నారు. నెల రోజుల పాటు పోషణమాసం కార్యక్రమాలు చేశామని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా తల్లులు అవగాహన పెంచుకోవాలన్నారు. కేవీకే ఆధ్వర్యంలో కూరగాయ విత్తనాలు ఇచ్చామని, మంచి అలవాట్లను మనం నేర్చుకుని ఇతరులకు చెప్పాలన్నారు. వార్డుల్లో కౌన్సిలర్లు తమ వంతు బాధ్యతగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. గతేడాది జిల్లాలో జరుపుకున్న పోషణమాసం కార్యక్రమాలకు గుర్తింపు వచ్చిందన్నారు. అందుకే జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు, హెల్త్‌ సిబ్బందికి, సీడీపీఓలకు, వైద్యులకు, పోషణటీంలకు ప్రశంసలు వచ్చాయన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. ముగింపు సమావేశంలో బతుకమ్మలతో అంగన్‌వాడీ టీచర్లు,అధికారులు బతుకమ్మలను ఎత్తుకొని సరదా చేశారు.

అనంతరం ఉత్తమ సేవలు అందించిన వారకి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌, వార్డు కౌన్సిలర్లు  మాచర్ల రాజకుమారి,  మాదా సత్యవతి,  అజ్మీరా సుజాత, మసూద్‌ జయంతి, కంబంపాటి  లీలారాణి,  బండి నరసింహారావు, పోలోజు చారి, గుమ్మెడెల్లి కళ్యాణి, సీడీపీఓ లెనీనీ, మంగతార, జిల్లా పోషణ అధికారి కల్పణ, సూపర్‌వైజర్‌ కాగితపు రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


logo